- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress MLA: ముందు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో.. మాకు నీతులు తర్వాత చెప్పొచ్చు
తెలంగాణ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గన్ కల్చర్ తీసుకొచ్చాడు..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గన్ కల్చర్ తీసుకొచ్చాడు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి అంటూ హరీష్ రావు(Harish Rao) మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పండుగపూట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడి హరీష్ రావు ఏడుస్తున్నడు.. ఇంట్లో కూర్చోలేక నోటికొచ్చినట్లు వాగుతున్నడు అని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని పిచ్చి మాటలు మాట్లాడుతున్నామని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి హరీష్ రావు ఓర్వలేకపోతున్నాడని సీరియస్ అయ్యారు. పదేళ్లలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో, బీఆర్ఎస్ నాయకులు ఎంత విచ్చలవిడిగా వ్యవహారించారో అందరికీ తెలుసని అన్నారు. నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య అత్యంత దురదృష్టకరమని చెప్పారు. దొంగను పట్టుకునే క్రమంలో ప్రమోద్ వీరమరణం చెందాడని అన్నారు. ఈ ఘటనను కూడా హరీష్ రావు రాజకీయాలకు ఉపయోగించుకోవడం నీచమని విమర్శించారు.
‘‘ఇరవై నాలుగు గంటల్లో హంతకుడిని పట్టుకున్నాం.. తెలంగాణ పోలీస్‌ల సమర్థతకు ఇది నిదర్శనం.. ఇకనైనా హరీష్ రావు జాగ్రత్తగా ఉండాలి.. ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదు.. కేబినెట్‌లో మంత్రుల కొట్టుకున్నారని హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నాడు.. కల్వకుంట్ల కుటుంబం రోజూ తన్నుకుంటూనే ఉంది.. ఈ విషయం అందరికీ తెలుసు.. కవిత కొట్టిన దెబ్బకు హరీష్ రావు మైండ్ బ్లాంక్ అయింది.. కవిత చేపట్టబోయే యాత్రలో హరీష్ రావు బాగోతం బట్టబయలు కాబోతుంది.. హరీష్ రావుకు దమ్ముంటే ముందు కుటుంబ, పార్టీని చక్కదిద్దుకోవాలి.. తర్వాత నీతులు ఎవరికైనా చెప్పొచ్చు’’ అని బీర్ల అయిలయ్య హితవు పలికారు.






