Harish Rao: బీఆర్ఎస్ కేడర్‌పై ఆగని మంత్రి అనుచరుల దాడులు.. హరీశ్‌రావు ఫైర్

by Ramesh Naini |

ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Harish Rao: బీఆర్ఎస్ కేడర్‌పై ఆగని మంత్రి అనుచరుల దాడులు.. హరీశ్‌రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో (Congress) కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం లోని నార్యనాయక్ తండాలో తాజాగా కేడర్ పై జరిగిన దాడే దీనికి నిదర్శనమని శనివారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీ‌ని ఆ పార్టీ కొల్లాపూర్‌‌లో అమలు చేయిస్తోందని ఆరోపించారు.సాతాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి జరిగి ఒక రోజు గడవక ముందే నార్యనాయక్ తండాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అనుచరుల దాడులు పెరిగిపోతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల కర్తవ్యమన్నారు. బీఆర్ఎస్ ఈ పనులు చేస్తుంటే కాంగ్రెస్‌కు జీర్ణం కావడం లేదు.. తమ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని భయపడుతూ దాడులుకు పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ (BRS) ఉద్యమ పార్టీ అని, ఇలాంటి ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలిచిందన్నారు. దాడులకు, కేసులకు మా కార్యకర్తలు భయపడరు.. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. దాడి ఘటనపై పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ కర్తవ్యం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Next Story