- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అక్రమ కేసులా? ఎక్స్‌లో హరీశ్ రావు
by Ramesh Naini |
జనగామ జిల్లాలో జర్నలిస్టు, గిరిజన బిడ్డ రాజ్ కుమార్‌ను అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జనగామ జిల్లాలో జర్నలిస్టు, గిరిజన బిడ్డ రాజ్ కుమార్‌ను అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పనితీరు పై ప్రజల అభిప్రాయాలను యధాతధంగా తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం చేస్తే ఎందుకంత కడుపు మంట.. అంటూ విమర్శించారు.
మీ దుర్మార్గ పాలనపై అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నది వాస్తవం కాదా? దీన్ని (YouTube) యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా (social media)లో పోస్ట్ చేస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తారా? ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులైన (Telangana journalists) జర్నలిస్టులను కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం ఇందిరమ్మ రాజ్యంలో నిత్యకృత్యం కావడం శోచనీయం.. అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.
Next Story






