ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ సీఎం (Chandrababu) చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ పడావు పెట్టాడని, బనకచర్లకు నీళ్లు గురుదక్షిణగా పంపించాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లను రద్దు చేసిందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటికీ మొదలు పెట్టింది లేదన్నారు. రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేర్చ లేదన్నారు.

గోదావరి జలాలు (Godavari waters) సమృద్ధిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కన్నెపల్లి పంపులను ఇప్పుడు ఆన్ చేసినా.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చెరువు నిర్మించారా? అని, కమిషన్ల పేరుతో కాలయాపన తప్ప చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ పెట్టి చెరువులను పునరుద్ధరణ చేపట్టారని గుర్తుకు చేశారు. హల్దీ, మంజీరాల మీద 8 చెక్ డ్యామ్‌లు నిర్మించామని తెలిపారు. హత్నూర, వెల్దుర్తి మండలాలకు నీరు వచ్చాయన్నారు. ఇక, మధ్యాహ్న భోజనం పథకంలో బిల్లులు రాలేదని ధర్నా చేస్తే కేసులు పెట్టడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి కోడిగుడ్ల టెండర్లలో గుత్తేదారు ఎంపికలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. నువ్వు పైసల్ ఇయ్యాక హాస్టల్ వార్డెన్లపై ఏసీబీ రైడ్‌లు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప చేసింది ఏమీ లేదని సీఎంను విమర్శించారు.

Next Story