- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడే భాయ్.. చోటే భాయ్ ఇద్దరు ముస్లిం వ్యతిరేకులు: హరీష్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లిహిల్స్ నియోజకవర్గ మైనారిటీ సెల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లిహిల్స్ నియోజకవర్గ మైనారిటీ సెల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశారో లేదో మీకే తెలుసని అన్నారు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుందని వ్యాక్యానించారు. కేసీఆర్ ముస్లీంలకు ఎంతో చేశారన్నారు. కేసీఆర్ షాదీ ముబారక్ ఇచ్చారని, ఇమామ్ లకు తడ్కా ఇచ్చారని, రంజాన్ మాసంలో తోఫా ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ సెక్యులర్ అని చెప్పుకుందని ఇమామ్ లకు రూ.12వేలు ఇస్తామని, ఓవైసీ స్కాలర్‌షిప్ పెంచుతామని హామీ ఇచ్చిందని కానీ అమలు చేయలేదని విమర్శించారు. విదేశాల్లో చదువుకునేందుకు ముస్లీం యువతకు రూ.10 లక్షల లోన్ ఇస్తామని చెప్పారని, ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. మాటలు కరోడ్ పతిలా ఉంటాయని చేతలు పకోడీలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బడే బాయ్, గల్లీలో చోటే బాయ్ ఇద్దరూ ఒకటే అని ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌లను ఉద్ధేశించి మండిపడ్డారు. ఢిల్లీలో ఒక్క ముస్లీం మంత్రి లేడని, ఇక్కడ కూడా లేడని విమర్శించారు.






