రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌మే.. హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-22 06:40:24  IST  )

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్‌వాసులు, మూసీ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌మే.. హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్‌వాసులు, మూసీ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంపీఆర్ అపార్ట్మెంట్స్ తో కేసీఆర్‌కు దగ్గరి సంబంధం ఉందని అన్నారు. ఈ అపార్ట్మెంట్ లకు కేసీఆర్ మంచినీళ్లు అందించారని చెప్పారు. కేసీఆర్ అపార్ట్మెంట్ లను నిలబెడితే రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మూసీ సుందరీకరణపై ఒక విధానం, ఒక పాలసీ లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మూసీలోకి మురికినీరు రాకుండా రూ.4వేల కోట్లు ఖర్చు చేసి 38 ఎస్టీపీలు నిర్మించిందన్నారు.

ఆరోజే కేసీఆర్ కాళేశ్వరం నుండి గోదావరి నీళ్లను తీసుకువచ్చి మూసీలో కలపాలని డీపీఆర్ తయారు చేశామన్నారు. మూసీ అభివృద్దిని తాము అడ్డుకోవ‌డంలేద‌ని, కానీ మూసీ పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం వ‌ద్ద‌న్నారు. పేదల ఇళ్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియ‌ల్ వ్యాపారం ఉంటుంద‌న్నారు. రెండేళ్ల క్రితం సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూములు లాక్కుంటాన‌ని చెప్పాడ‌న్నారు. హిల్ట్ స్కామ్ పాల‌సీతోనూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల‌నుకున్నాడ‌ని అన్నారు. ఫార్మాసిటీని ఫ్యూచ‌ర్ సిటీగామార్చి రియ‌ల్ వ్యాపారానికి తెర‌లేపార‌న్నారు. ఇప్పుడు మూసీ పేరుతోనూ అదే జ‌రుగుతుంద‌ని విమ‌ర్శించారు. పథకాలకు డబ్బులు లేవనే రేవంత్ రెడ్డి అందాల పోటీసులు, మెస్సీని తీసుకువచ్చి ఫుట్ బాట్ ఆటలు ఎలా ఆడించాడని ప్రశ్నించారు.

‘సర్కారుకు పంతాలు పట్టింపులు వద్దు.. ఆ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి’: హరీష్ రావు

Next Story