- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
కోట్లు ఖర్చు చేసి గ్లోబస్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదు,

దిశ, వెబ్ డెస్క్: కోట్లు ఖర్చు చేసి గ్లోబస్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు, విజన్ డాక్యుమెంట్ కాదు, 'విజన్‌లెస్' డాక్యుమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు.
అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవని అన్నారు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి రేవంత్ రెడ్డి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అని ప్రశ్నించారు. అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? అని అడిగారు. ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.






