- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులు లేకుండా బయట తిరగండి.. మంత్రులకు హరీష్‌రావు సవాల్
రేవంత్ రెడ్డిని ఎవడూ నమ్మడని గాంధీల మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను నిలువనా మోసం చేశారని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డిని ఎవడూ నమ్మడని గాంధీల మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను నిలువనా మోసం చేశారని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల హామీల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇంటింటికీ పంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చి 700 రోజులు గడుస్తున్నా.. బాండ్ పేపర్లకు దిక్కులేదని కామెంట్ చేశారు. ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కనీసం తెలంగాణ ముఖం కూడా చూడటం లేదని అన్నారు. బాకీ కార్డు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిట ఉరి తాడు అవుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ పడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాఅబద్ధపు హామీలతో జనం విసిగిపోయారని.. దమ్ముంటే పోలీసులు లేకుండా మంత్రులు బయట తిరగాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.
ప్రతి మహిళకు బాకీ పడిన రూ.44 వేల ఇచ్చాకే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలని హరీశ్ రావు అన్నారు. ఊరూరా బెల్టు షాపులు, మైక్రో బ్రూవరీలు పెట్టి తాగుబోతుల తెలంగాణ రేవంత్ రెడ్డి మారుస్తున్నాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ (KCR) తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాడని గుర్తు చేశారు. నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) కోసం ఒక్క రూపాయి చెల్లించని చేతకాని ప్రభుత్వం ఇదేనని అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ గొంతు కోసిందని ధ్వజమెత్తారు. గ్యారంటీలకు టాటా చెప్పిండు లంక బిందెల వేట రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్ధమైండని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, బీహార్ ఎన్నికలకు పంపడానికి పైసలు ఉంటాయని.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా కాలువల్లో పారుతుంటే కళ్లుండి కూడా చూడ లేని కబోదులు కాంగ్రెస్ నాయకులని హరీశ్ రావు అన్నారు.






