Harish Rao: అధైర్యపడకండి.. జోర్డాన్‍లో చిక్కుకున్న కార్మికులకు ఫోన్‍లో హరీశ్ రావు భరోసా

by Prasad Jukanti |   (  Updated:2025-10-12 11:16:59  IST  )

జోర్డాన్‍లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధైర్యం చెప్పారు.

Harish Rao: అధైర్యపడకండి.. జోర్డాన్‍లో చిక్కుకున్న కార్మికులకు ఫోన్‍లో హరీశ్ రావు భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మీరు అధైర్య పడవద్దని జోర్డాన్‍లో (Jordan) చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ధైర్యం చెప్పారు. ఆందోళన పడవద్దని మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‍లో12 మంది నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన వలస కార్మికులు ఏజెంట్ మోసానికి బలైఅక్కడే చిక్కుకుపోయారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమను ఎలాగైనా తమ కుటుంబాల వద్దకు చేర్చాలని వేడుకుంటున్నారు. ఈక్రమంలో వారికి ఆదివారం హరీశ్ రావు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మీ సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకువెళ్ళామని మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. మీ ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు హరీశ్ రావు వివరించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ధైర్యం కోల్పోవద్దని చెప్పారు.

Next Story