- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి కొనుగోళ్లలో రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు -హరీష్ రావు
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాంబు పేల్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

దిశ, వెబ్ డెస్క్: పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాంబు పేల్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్ల కల్లాలను పరిశీలించారు హరీష్ రావు ( Harish rao). ఈ సందర్బంగా కనీస సౌకర్యాలు లేవని, అధికారులు పట్టించుకోవడంలేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను చెప్పుకున్నారు రైతులు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. పత్తి కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్నారు.
కేవలం 20% పత్తి రైతులకు మాత్రమే మద్దతు ధర వచ్చింది, 80% పత్తిని బ్రోకర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని సీసీఐకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. సీసీఐ అధికారుల పట్ల వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ( REVANTH REDDY )ప్రభుత్వానికి అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి సహజ మరణాలు కాదు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు అలాగే అకాల వర్షాలు పడుతున్నాయి... ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఫైర్ అయ్యారు. రైతులను పట్టించుకోకుండా అందాల పోటీలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం అమ్మిన డబ్బులు పది రోజులు దాటినప్పటికీ కూడా రైతులకు చెల్లించడం లేదని ఫైర్ అయ్యారు. ధాన్యం డబ్బులను 48 గంటలలోపే చెల్లిస్తామని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala) చెప్పిన మాటలు ఉత్తమాటలే అంటూ సెటైర్లు పేల్చారు హరీష్ రావు.






