ఓ మహాత్మా మన్నించు! దీన స్థితిలో గాంధీ ఆసుపత్రి బాపు విగ్రహం : హరీశ్‌రావు ఫైర్

by Ramesh Naini |

ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం, నేడు నిర్వహణ లేక దీన స్థితిలో ఉండటం బాధాకరమని, ఓ మహాత్మా మన్నించు.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఓ మహాత్మా మన్నించు! దీన స్థితిలో గాంధీ ఆసుపత్రి బాపు విగ్రహం : హరీశ్‌రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం, నేడు నిర్వహణ లేక దీన స్థితిలో ఉండటం బాధాకరమని, ఓ మహాత్మా మన్నించు.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) ఎదురుగా ఉన్న బాపూజీ కాంస్య విగ్రహం అధికారుల నిర్లక్ష్యానికి గురైందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ గాంధీ ఆసుపత్రి ముందు గాంధీ కాంస్య విగ్రహం ఆవిష్కరించారని తెలిపారు. (KCR) కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని పేర్కొన్నారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని ఫైర్ అయ్యారు.

చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు సిద్ధాంతం

చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డి ది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్ధాంతం.. అని విమర్శలు చేశారు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదేనని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలే పట్టని (Congress) కాంగ్రెస్ పార్టీకి, (Statue of Mahatma Gandhi) గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుందని నిలదీశారు. ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసుకోవడం చేత కాదు, కానీ బాపు ఘాట్ పునరుద్దరిస్తమని బడాయి కొడుతున్నాడని విమర్శించారు.

Next Story