- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: హరీశ్ రావు
ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ సంక్షోభంలోకి నెడుతున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ సంక్షోభంలోకి నెడుతున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు పోక, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన రాక సాగునీటి రంగం గందరగోళంలో పడిందని తెలిపారు. నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి, సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్‌ది అయితే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్‌రెడ్డిది అని ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలు అని పేర్కొన్నారు. ఖమ్మం పెద్దవాగు కొట్టుకుపోయిందని.. నల్లగొండ సుంకిశాల కుప్ప కూలిందని.. పాలమూరు వట్టెం పంప్ హౌజ్ జలమయమైందని.. నల్గొండలో ఎస్ఎల్‌బీసీ కుప్ప కూలిందని.. జోగులాంబ గద్వాల్‌లో జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయాయని.. సంగారెడ్డి మంజీర డ్యాం ఆప్రాన్ వరద దాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్‌లలో పగుళ్లు వచ్చాయని పేర్కొన్నారు. పాలనలో వైఫల్యం, కాంగ్రెస్ చేతగాని తనం వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయని తెలిపారు.
ఇవేవీ ఎన్డీఎస్ఏకు కనిపించవు, వినిపించవని ఆరోపించారు. మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిన కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఏడుస్తూ కాలం వెల్లదీయడం తప్ప, ఏడాదిన్నరగా సీఎం రేవంత్ రెడ్డి చేసిందేంటని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని చెప్పి, ఆరు వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. బనకచర్ల ద్వారా ఏపీ తరలించే కుట్ర జరుగుతున్నదని.. ఏపీకి కేంద్రం నిధులు తరలివెళ్తున్నాయని.. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు రోడ్లెక్కే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి, ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతాం
ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం హరీశ్‌రావును పటాన్‌చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్‌ఎస్ ముందుండి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు స్పందించారు. ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారని.. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను వెంటనే చెల్లించాలన్నారు.






