- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తు్న్నట్లు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విసిరిన సవాల్‌ను స్వీకరిస్తు్న్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అసెంబ్లీలో గోదావరి జలాల మీద ఎంతసేపైనా చర్చిద్దాం.. ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే కెమెరా తిప్పకుండా మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలి’ అని హరీష్ రావు సైతం సవాల్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
ఇదిలా ఉంటే.. గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుందని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వివాదమే ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు కట్టి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ఇకనైనా ప్రాజెక్టులు పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టుల నిర్మాణానికి, భూ సేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఉంది. మేడిగడ్డ కుంగిన తర్వాత అక్కడి నుంచి నీరు ఎత్తిపోయలేదు. కాళేశ్వరం నిరుపయోగమైనా.. అత్యధికంగా వరి దిగుబడి వస్తోంది. కేసీఆర్, హరీష్ రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించారు, తీర్పు ఇచ్చారు. పదేళ్లు వాళ్లేం చేశారో, ఈ ప్రభుత్వం ఏం చేసిందో సభలో చర్చిద్దాం. పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలెంట్ చేసిన విషయం తెలిసిందే.






