- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌రెడ్డి
మహా శివరాత్రి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మహా శివరాత్రి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువ జామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఇక మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ మహదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొనున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్‌రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లు సమాచారం. అలాగే, పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఆ మహదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. #Mahashivratri2025 pic.twitter.com/mznE0Z73y2
— Telangana CMO (@TelanganaCMO) February 26, 2025






