- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: ఈత రాకపోవడంతో అమెరికాలోని ఓ సరస్సులో మునిగి తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. హన్మకొండకు చెందిన ఉత్తేజ్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు అమెరికాలోని సెయింట్ లూయిస్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. స్నేహితులతో కలిసి ఉత్తేజ్ ల్యాండర్ వ్యాలీ సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్స్ ఈత కొడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే ఈక్రమంలోనే ఒడ్డుపై కూర్చున్న ఉత్తేజ్ ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడి పోలీసులు సరస్సులో గాలించి ఉత్తేజ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు హతాశులయ్యారు.
Read More...
Next Story






