- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.148.30 కోట్లు మంజూరు చేయండి.. మంత్రి ఉత్తమ్‌కు గుత్తా లేఖ
మాధవరెడ్డి లిఫ్ట్ 5వ యూనిట్ పుట్టంగండి దగ్గర మోటార్‌ను అమర్చి 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మాధవరెడ్డి లిఫ్ట్ 5వ యూనిట్ పుట్టంగండి దగ్గర మోటార్‌ను అమర్చి 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ మోటార్ వల్ల నల్గొండ జిల్లాలోని 21 మండలాలకు నీరందుతుందని పేర్కొన్నారు. కేవలం రూ.148.30 కోట్ల నిధులు మంజూరు చేస్తే జిల్లాలోని రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. 5వ యూనిట్ ఏర్పాటు కోసం రూ.148.30 కోట్ల అంచనా వ్యయంతో ఒక ప్రతిపాదనను ఎంఏ అండ్ యూడీ డిపార్ట్‌మెంట్ ఆమోదం కోసం మే, 15 పంపినట్లు తెలిపారు. నిధులకు వెంటనే ఆమోదం తెలిపి విడుదల చేయాలని కోరారు.
Next Story






