- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హరీష్ రావు అనుభవజ్ఞుడు.. ఇలా మాట్లాడడం సరికాదు’
హరీశ్‌రావు చాలా అనుభవజ్ఞుడు అని.. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అనుభవం ఉందని.. ఎస్ఎల్బీసీ ఘటనపై రాజకీయం చేయడం మంచిది కాదని శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హరీశ్‌రావు చాలా అనుభవజ్ఞుడు అని.. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అనుభవం ఉందని.. ఎస్ఎల్బీసీ ఘటనపై రాజకీయం చేయడం మంచిది కాదని శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు వెళ్లడం మంచిదని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన ఘటనలు ప్రమాదంగా చూడాలని, రాజకీయ ధోరణిలో చూడటం సరైంది కాదని అన్నారు. ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమని, ప్రభుత్వ రంగ ఎక్స్‌పర్ట్స్, ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు చేపడుతున్నదని చెప్పారు.
రెస్క్యూ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా విఫలం కాలేదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటన జరిగిన 2 గంటల్లోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడకు చేరుకొని అన్ని శాఖలను సమన్వయం చేసుకొని పనిచేశారని తెలిపారు. పెద్ద ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతున్నప్పుడు అనుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని.. ప్రమాదాలకు భయపడి ప్రాజెక్ట్‌లు మూసుకుంటామా అని ప్రశ్నించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పారు.
ఈ టన్నెల్ వయోబిలిటీ కాదని కేటీఆర్ అంటున్నారని.. మరి అలాంటప్పుడు వారి ప్రభుత్వం హయాంలో రూ.3,600 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని నిలదీశారు. రాజకీయ విమర్శలకు ఇది వేదిక కాదని.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను కాపాడాల్సిన సమయం అని అన్నారు. పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధలో 25 శాతం ఎస్ఎల్బీసీపై పెడితే ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. 2005లో జయప్రకాషన్ కంపెనీకి ఈ టన్నెల్‌ను గత ప్రభుత్వం అప్పగించిందని, ఎస్ఎల్బీసీపై గతంలో చంద్రబాబు హయాంలో కమిటీ వేయడం జరిగిందని, ఆ కమిటీలో తనతోపాటు ఆరుగురు సభ్యులు ఉన్నారని తెలిపారు.
2009, 2010 వరదల్లో టన్నెల్ మునిగిపోయిందని పేర్కొన్నారు. 2014 తరువాత కేసీఆర్ రివ్యూ మీటింగ్ పెట్టారని, పనులు ప్రారంభించాలని రివ్యూ మీటింగ్‌లో తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు హయాంలో ఈ టన్నెల్‌పై రివ్యూలు జరిగేవని, హరీశ్‌రావు తరువాత ఇరిగేషన్ శాఖ కేసీఆర్ దగ్గరే ఉండటంతో ఎస్ఎల్బీసీపై రివ్యూలు లేకుండా పోయాయని చెప్పారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






