HCA అక్రమాల్లో కేటీఆర్, కవిత ప్రమేయం: గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(HCA)లో చోటుచేసుకున్న అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి(Guruvareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

HCA అక్రమాల్లో కేటీఆర్, కవిత ప్రమేయం: గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(HCA)లో చోటుచేసుకున్న అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి(Guruvareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. HCA అక్రమాల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(Kavitha) ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. సంపత్ కుమార్‌ను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తక్షణమే సోసైటీని రద్దు చేయాలని అన్నారు. హెచ్‌సీఏలో బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తెలిపారు.

కాగా, గతంలోనూ గురువారెడ్డి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏలో (HCA) గతంలో ఉన్నట్టు ప్రస్తుతం లేదని.. అలా ఉంటే ప్రతీ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ బయటకి వస్తాడని గురువారెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితం అయిందన్నారు. హెచ్‌సీఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ప్రతీ సంవత్సరం హెచ్‌సీఏకు రూ.100 కోట్ల వరకు ఇస్తుందని ఆయన వెల్లడించారు. దాదాపు ఇప్పటి వరకు రూ.170 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. విజిలెన్స్ వారు విచారణ చేయడం.. తర్వాత సీఐడీ ఎంటర్ అవ్వడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి అన్నారు.

Next Story