Telangana News : గురుకులాల పనివేళలు సవరించాలి : టీఎస్యూటీఎఫ్

by Muthe.Rajitha |

గురుకులాల పనివేళలు(Gurukula School Timings) సవరించాలని చీఫ్ సెక్రేటరీ శాంతి కుమారి( CS Shanthi Kumari)కి టీఎస్యూటీఎఫ్(TSUTF) నాయకులు వినతి పత్రం అందించారు.

Telangana News : గురుకులాల పనివేళలు సవరించాలి : టీఎస్యూటీఎఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : గురుకులాల పనివేళలు(Gurukula School Timings) సవరించాలని చీఫ్ సెక్రేటరీ శాంతి కుమారి( CS Shanthi Kumari)కి టీఎస్యూటీఎఫ్(TSUTF) నాయకులు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో పనివేళలు మార్చాలని పేర్కొన్న నాయకులు.. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల బోధనా సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండేలా మార్పు చేయాలని సీఎస్ కు వినతి పత్రంలో సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య తదితరులు మంగళవారం సీఎస్ ను ప్రత్యేకంగా కలిసి విన్నవించారు.

Next Story