HYD: ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు

by Gantepaka Srikanth |

సిక్కుల మత గురువు గురునానక్ 556వ జయంతోత్సవాలను సిక్కులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

HYD: ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
X

దిశ, బేగంపేట: సిక్కుల మత గురువు గురునానక్ 556వ జయంతోత్సవాలను సిక్కులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ సిక్కు ప్రబంధక్ కమిటీ నిధులు నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాలలో సిక్కు యువత భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రదర్శించిన సిక్కు యుద్ద విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సిక్కుయుద్ధ కలలు, షాబాదు కీర్తనలతో లస్కర్ పురవీధులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో ప్రబంధ కమిటీ అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ బగ్గ, ప్రధాన కార్యదర్శి జన్మోహన్ సింగ్, హరిప్రియత్ సింగ్ గులాటి, సత్విందర్ సింగ్, జోగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.










Next Story