- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్ఫ్ బాటలో ఒయాసిస్.. డాక్యుమెంటరీ ఫిల్మ్
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని వివరించేందుకు గల్ఫ్ బాటలో ఒయాసిస్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తీశారు.

- గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ భరోసా
- సినిమాను విడుదల చేసిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ అంబాసిడర్ డా.బీఎం వినోద్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని వివరించేందుకు గల్ఫ్ బాటలో ఒయాసిస్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తీశారు. బుధవారం గాంధీ భవన్ లో ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ అంబాసిడర్ డా.బీఎం వినోద్ కుమార్ విడదల చేశారు. సీఎం ఏ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ చిత్ర బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాల అభిప్రాయాను చిత్రీకరించింది. ప్రభుత్వం అందజేసిన గల్ఫ్ భరోసాలో భాగంగా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా పొందిన బాధిత కుటుంబ సభ్యుల అభిప్రాయలు సేకరించి డాక్యుమెంటరీ ఫిల్మ్ ను చిత్రీకరించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి బాధితుల కుటుంబ వాస్తవ పరిస్థితులను తెరకెక్కించారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి.సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన గల్ఫ్ జేఏసీ నాయకులు చెన్నమనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.






