ఇటుకబట్టి కూలీ టు చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్.. HYDలో మురుగన్ గ్యాంగ్ లింకులపై గుజరాత్ పోలీసుల ఆరా

by Prasad Jukanti |   (  Updated:2026-04-30 05:20:11  IST  )

హైదరాబాద్‌లో చిన్నారుల అక్రమ రవాణా చేస్తున్న మురుగన్ ముఠా గుట్టును గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించారు.

ఇటుకబట్టి కూలీ టు చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్.. HYDలో మురుగన్ గ్యాంగ్ లింకులపై గుజరాత్ పోలీసుల ఆరా
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్‍లో చైల్డ్ ట్రాఫికింగ్ ఎపిసోడ్‍లో మాఫియా నెట్ వర్క్ అందరిని షాక్‍కు గురిచేస్తోంది. హైదరాబాద్‍లో చిన్నారుల అక్రమ రవాణాకు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు సహకరించడం కలకలం రేపుతోంది. చిన్నారుల అక్రమ రావాణాకు సహకరిస్తున్న మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్‍ను అరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు అతడి నెట్ వర్క్ పై ఆరా తీస్తున్నారు. మురుగన్ గ్యాంగ్‍తో ఫెర్టిలిటీ సెంటర్ల సంబంధాలపై విచారణకు హైదరాబాద్ వచ్చిన గుజరాత్ పోలీసులు.. కూకట్‍పల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్ లో సోదాలు చేశారు.

ఇటుక బట్టి టు కింగ్ ఫిన్:

అయితే ఈ కేసులో మరుగన్‍కు సంబంధించిన విషయాలు సంచలనంగా మారాయి. ఆదిలాబాద్‍లో గతేడాది వరకు ఇటుకల బట్టిలో పని చేసిన మురుగన్ అలియాస్ నాగరాజు ఒక్క ఏడాదిలోనే ఛైల్డ్ ట్రాఫికింగ్‍లో కింగ్ పిన్‍గా ఎదిగిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి గతేడాది చైతన్యపురి పీఎస్‍లో నమోదైన ఫెర్టిలిటీ కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు గతేడాది 3 నెలల పాటు జైలులో ఉండి గత జులైలో విడుదలై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఏకంగా దేశవ్యాప్తంగా ఛైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. మురుగన్ భార్య కృష్ణవేణి మరో గ్యాంగ్‍ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ గ్యాంగ్ 25 మంది చిన్నారుల విక్రయాలు చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్న మురుగన్ గ్యాంగ్ కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేదానిపై అధికారులు దృష్టి సారించారు.

Next Story