Breaking News : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-01-13 16:12:43  IST  )

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)కు ప్రభుత్వం మార్గదర్శకాలు(Guidelines) విడుదల చేసింది.

Breaking News : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)కు ప్రభుత్వం మార్గదర్శకాలు(Guidelines) విడుదల చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. అప్లికేషన్స్ పూర్తిగా పరిశీలించిన తర్వాత కులగణన(Cast Survey) సర్వే ఆధారంగా రేషన్ కార్డ్ లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలనకు పంపిస్తారు. ఇక మండలస్థాయిలో ఎంపీడీవో, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ఎంపికకు బాధ్యత వహిస్తారు. రూపొందిన జాబితాను గ్రామసభలో ప్రదర్శించి, చదివి వినిపించిన తర్వాత ఆమోదం లభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి, ఈనెల 26వ తేదీ నుంచి అర్హులకు పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది.

పాత విధానంలో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతంలో రూ. 2లక్షల ఆదాయం ఉండాలి. సొంత ఇల్లు, కార్లు, ఇతర వ్యాపారులు ఉన్నవారు అర్హులు కారు. ప్రభుత్వం సూచించిన విధానాల ప్రకారం ఉన్నవారిందరికి త్వరలో మంజూరు అవుతుంది. సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతోంది. మూడు నెలకితం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల పరిమితిపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించడంతో కొత్త కార్డుల ప్రక్రియ ప్రభుత్వం వేగవంతం చేసింది.

నగరంతో పాటు పలు గ్రామాల్లో సర్వే చేసే సమయంలో అందుబాటులో లేని పేర్లు నమోదు కాలేదు. వారి పరిస్థతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తారా, కుల గణన ఆధారంగా చేస్తారనే అంశంపై పలువురు సందిగ్దం ఏర్పడింది. గ్రేటర్​ హైదరాబాద్​ నగరంలో ఇప్పటివరకు కూడా సర్వేకు ఇబ్బంది రాలేదు. వారికి రేషన్​ కార్డులు వస్తాయా అనే అంశంపై అనుమానం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుల గణన ఆధారమైతే చాలామంది భూములు, ఆస్తులు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం పథకాలు రావని తప్పగా నమోదు చేశారు. వారు దరఖాస్తు చేస్తే కార్డు ఖచ్చితంగా వస్తుంది. కులగణన ప్రామాణికంగా కాకుండా ప్రతి దరఖాస్తును ఇంటింటికి వెల్లి పరిశీలన చేయాలని కోరుతున్నారు.

2.81 కోట్ల లబ్ధిదారులు.. లక్షల్లో అర్జీలు :

రాష్ట్రంలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2.81 కోట్ల మంది లబ్దిదారులుగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్దిదారుల సంఖ్య 24 లక్షలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జన వరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు దాదాపు 10 లక్షల పైగా వచ్చాయి. ఇంకా పెరగవచ్చని అధికారులు బావిస్తున్నారు.


కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు:

1. కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు, జీహెచ్​ఎంసీ కమిషనర్ కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడుతుంది.

2. మండల స్థాయిలో ఎంపిడిఓ, యుఎల్​బిలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు.

3. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) , డిసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.

4. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డు సభ లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన తరువాత ఆమోదిస్తారు.

5. గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్దిదారుల అర్హత జాబితాను మండల, మున్సిపల్ స్థాయి లో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ / జీహెచ్​ఎంసీ కమీషనర్ లాగిన్ కు పంపాలి.

6. ఆ విదంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్. జీహెచ్​ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్ లాగిన్ కి పంపాలి.

7. ఇది తుది జాబితా ప్రకారం, సీసీఎస్​ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.

8. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.9. ఆహారభద్రత కార్డులలో సభ్యుల చేర్పులు తొలగింపులు చేయాలి.

10. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి.








Next Story