- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేనేత, హస్తకళల ఉత్పత్తులపై GST ఎత్తివేయాలి.. PM, ఆర్థిక మంత్రికి MLC ఎల్.రమణ లేఖ
చేనేత, హస్తకళల ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత, హస్తకళల ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ లేఖ రాశారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ముందుండి నడిపిస్తున్నారని.. చేనేత, హస్తకళల రంగం నిజమైన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా, ప్రపంచంలోనే దాదాపు 95 శాతం చేతివృత్తుల ఉత్పత్తులు తయారవుతాయని తెలిపారు. ఈ రంగం లక్షలాది మంది గ్రామీణ భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నదని పేర్కొన్నారు. అయితే.. 2017 నుంచి కేంద్రం ప్రభుత్వం ఈ రంగాలపై జీఎస్టీ విధించిందని తెలిపారు. దీంతో కళాకారులు కష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
చేనేతపై 5 శాతం వరకు పన్నులు విధించడం వల్ల ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరిగి.. చేతివృత్తుల ఉత్పత్తులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్‌లూమ్, మిల్లు ఉత్పత్తులతో పోటీ పడలేక చేనేత రంగం కుదేలైందని పేర్కొన్నారు. ఇటువంటి సుస్థిర పరిశ్రమకు చేయూతనివ్వాల్సింది పోయి పన్నుల భారాన్ని మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చేనేత, హస్తకళలు, ఇతర గ్రామీణ ఆధారిత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి..
కేంద్రం జీఎస్టీ రద్దు చేయని పక్షంలో గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే చేనేత రంగం జీఎస్టీ భరించాలని ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. సీఎం కళాకారుల కష్టాలను గుర్తించి.. హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ నిర్ణయం కళాకారులకు ఎంతగానో ఆర్థికంగా ఊరటనిస్తుందని తెలిపారు. అలాగే.. రాష్ట్రం తరఫున జీఎస్టీ కౌన్సిల్‌కు హాజరయ్యే ప్రతినిధులు సైతం చేనేతపై పూర్తిగా జీఎస్టీ తొలగించేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.






