- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తు సవరణపై TSPSC కీలక ప్రకటన
గ్రూప్- 4 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్- 4 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఇదే చివరి అవకాశమని.. ఈ నెల 15 తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదని అభ్యర్థులకు సూచించింది. పూర్తి వివరాల కోసం టీఎస్ పీఎస్సీ సైట్‌లో చూసుకోవాలని తెలిపింది. కాగా, 8039 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, జూలై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష జరగనుంది.
Read More:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే?
Next Story






