Group-1 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో గ్రూప్-1 ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. కాసేపట్లో గ్రూప్‌-1 (Group-1) పరీక్షా ఫలితాలు (Results) విడుదల కానున్నాయి.

Group-1 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో గ్రూప్-1 ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. కాసేపట్లో గ్రూప్‌-1 (Group-1) పరీక్షా ఫలితాలు (Results) విడుదల కానున్నాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల (Preliminary Marks) వివరాలను ఇవా టీజీపీఎస్‌సీ (TGPSC) వెల్లడించనుంది. అదేవిధంగా మంగళవారం గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌‌తో పాటు 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ (General Rankings)ను విడుదల చేయనున్నట్లు టీపీపీఎస్‌సీ (TGPSC) ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ముందు మెయిన్స్ మార్కుల ప్రకటనతో గ్రూప్‌-1 నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌పై అభ్యంతరాలు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే 1:2 నిష్పత్తిలో తుది జాబితాను రిలీజ్ చేయనున్నారు. అనంతరం గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలను టీజీపీఎస్‌సీ వెబ్‌సై‌ట్‌ tspsc.gov.inలో ప్రదర్శించనున్నారు.

Next Story