- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1 issue: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court)లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court)లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గ్రూపు-1 నియామకాల(Group-1 Recruitment) విషయంలో హైకోర్టు(Telangana High Court) ఆదేశాలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, గ్రూపు-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని.. నియామకాలపై స్టే విధించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్టే విధించేందుకు నిరాకరించింది.
ఇదిలా ఉంటే.. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవలే టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయవివాదం నేపథ్యంలో విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు.






