- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : గ్రూప్ 1 వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం
గ్రూప్ 1 వివాదం(Group 1 Issue)పై నేడు హైకోర్టు(High Court)లో మరోసారి విచారణ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 1 వివాదం(Group 1 Issue)పై నేడు హైకోర్టు(High Court)లో మరోసారి విచారణ జరిగింది. టీజీపీస్సీ9TGPSC) నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో(Group 1 Mains Exams) అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని, పరీక్ష కెనరాల కేటాయింపులో అనుమానాలు ఉన్నాయని, మరోసారి సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేసేలా కమిషన్ ను ఆదేశించాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. టీజీపీస్సీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల వాదనలు అపోహాలని, నిపుణుల పర్యవేక్షణలోనే పేపర్ వాల్యుయేషన్ జరిగిందని విన్నవించారు. కాగా తెలుగులో రాసిన వాళ్ళకు మార్కులు ఏ విధంగా కేటాయించారో స్పష్టత ఇవ్వాలని కోర్ట్ కమిషన్ ను ఆదేశించింది.
అయితే ఈ వ్యవహారంపై బుధవారం జరిగిన విచారణలోనూ కమిషన్ ను ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు అడిగింది. పక్క రాష్ట్రాల్లో ఇంగ్షీషు వచ్చినా వారి మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తారని.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తారనేది స్పష్టం అని తెలిపింది కోర్ట్. ఈ వివాదంలో తెలుగులో సమాధానాలు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయనేది అభ్యర్థుల ప్రధాన ఆరోపణ కాబట్టి.. దానికి గల కారణాలను తెలపాలని.. మార్కుల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేపట్టారు అనేది పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్ట్.. టీజీపీస్సీని ఆదేశిసిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది.






