- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1 లో ఎస్ఐకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్.. సీబీఐ దర్యాప్తుకు నిరుద్యోగుల డిమాండ్
గ్రూప్-1 వివాదంలో నిరుద్యోగులు సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 వివాదం (Group-1 Controversy) చల్లారటం లేదు. ఈ విషయంలో తాజాగా నిరుద్యోగులు సంచలన డిమాండ్ చేశారు. గ్రూప్-1 ఇష్యూ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓయూ జనార్ధన్ మాట్లాడుతూ.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం రివాల్యువేషన్ చేస్తే ఇబ్బంది ఏంటి? టీజీపీఎస్సీ (TGPSC) చేసిన తప్పులను ఎత్తి చూపుతుంటే ర్యాంకులు సాధించిన వారు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఇవాళ చెప్తున్నాం 6వ ర్యాంకు సాధించిన అభ్యర్థి జెల్ పెన్ తో ఎగ్జామ్ రాశారని ఆరోపించారు. ఈ విషయంలో దమ్ముంటే నాపై డిఫమేషన్ వేయాలని సవాల్ విసిరారు. సింగిల్ బెంచ్ ముందు ఈ జెల్ పెన్ ఇష్యూ రాకుండా టీజీపీఎస్సీ ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. ఉద్యోగాలు చేస్తున్నవారు, కోటీశ్వరుల పిల్లలు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. ఫస్ట్ జోన్ లో ఓ ఎస్ఐకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ విషయంలో సింగిల్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కీ పోస్టులన్నీ రెడ్లకే పోయాయని, గ్రూప్-1 లో అక్రమంగా అధిక సంఖ్యలో ఆంద్రోళ్లు ఉద్యోగాలు సాధించుకున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోరాడితే న్యాయం మన పక్షమే తప్పకుండా వస్తుందన్నారు.
మరో అభ్యర్థి మాట్లాడుతూ.. తమ బాధలను సింగిల్ బెంచ్ ధర్మాసనం సావధానంగా విని ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కేవలం 30 నిమిషాల్లోనే ఎలాంటి వాదనలు వినకుండా అభ్యర్థుల భవిష్యత్, తెలంగాణ భవిష్యత్ ను అన్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వడం అత్యంత దారుణం అని విమర్శించారు. పెన్నులతో కాదు గన్నులతో న్యాయం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి ఈ సమాజానికి చెప్పినట్లు అవుతుందన్నారు. గ్రూప్1 విషయంలో అనేక అక్రమాలు జరిగాయని ఈ విషయంపై రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు స్పదించాలన్నారు.






