Grok: భారత్‌ రాజధానిగా హైదరాబాద్..! ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ చెప్పిన సమాధానం వైరల్

by Ramesh Naini |

భారతదేశానికి ఢిల్లీ కాకుండా రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

Grok: భారత్‌ రాజధానిగా హైదరాబాద్..! ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ చెప్పిన సమాధానం వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశానికి ఢిల్లీ కాకుండా రాజధానిగా (Hyderabad) హైదరాబాద్ ఉండాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. దేశానికి (capital) రాజధానిగా హైదరాబాద్ నగరమే ఉండాలనే చర్చకు రావడం కొత్తేమీ కాదు. కానీ, ఈ సారి చర్చల్లో పాల్గొన్నది మనిషి కాదు.. ఏఐ దిగ్గజ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok chatbot). కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలో అన్ని ప్రధాన నగరాలకంటే భాగ్యనగరమే భారత్‌కి బెస్ట్ రాజధాని అని గ్రోక్ కితాబు ఇచ్చింది. ఎక్స్ వేదికగా @IndianTechGuide అనే యూజర్ రాజధాని గురించి టాపిక్ పోస్ట్ చేశారు. భారతదేశ రాజధానిగా మీరు న్యూఢిల్లీ కాకపోతే ఏ నగరాన్ని ఇష్టపడతారు? అని ట్వీట్ చేశారు. దీనికి చాలా మంది నెటిజన్లు హైదరాబాద్, పుణే, ఇండోర్, నాగ్‌పూర్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై అంటూ పలు ఫేమస్ భారత నగరాల పేర్లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో ఓ నెటిజన్ గ్రోక్‌ను ప్రశ్నించగా గ్రోక్ సైతం హైదరాబాద్ నగరం వైపే మొగ్గుచూపింది. నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు టెక్ ఎకో సిస్టమ్ ఉందని.. ఢిల్లీ కన్నా హైదరాబాద్ వాతావరణం ఎంతో మెరుగైనదని గ్రోక్ సమాధానం ఇచ్చింది.

ఈ ఆన్సర్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ అయింది. చాలా మంది నెటిజన్లు సైతం హైదరాబాద్ దేశ రాజధానిగా ఉండడాన్ని సమర్ధించారు. అందులో ఓ వ్యక్తి చేసిన కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ‘హైదరాబాద్ సౌత్‌ లోకేషన్ ఉంది. కాబట్టి సౌత్ వర్సెస్ నార్త్ ఇండియా అనే వాదన అవసరం లేదు. పొరుగు దేశాలకు చాలా దూరంలో ఉంది. మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ హిందీ సులభంగా అర్థమవుతుంది. భాషాపై యుద్ధం లేదు. సులభంగా మైగ్రేషన్ అవ్వొచ్చు. ఎన్నో స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. టెక్ సిటీ, రామోజీ ఫిల్మ్‌సిటీ. టాలీవుడ్ ఉన్నాయి’ అని స్వప్న కుమార్ పండా (@swapnakpanda) అనే యూజర్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్ లింక్..

Next Story