- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిర్యాదుల కోసం ‘గ్రీవెన్స్ మాడ్యూల్’
గ్రామాల్లో ఎవరైనా నియమావళిని అతిక్రమిస్తే పౌరులు తమ ఫిర్యాదులను సులభంగా అప్‌లోడ్ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీవెన్స్ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో ఎవరైనా నియమావళిని అతిక్రమిస్తే పౌరులు తమ ఫిర్యాదులను సులభంగా అప్‌లోడ్ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీవెన్స్ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు చేయడమే కాకుండా.. వాటి పరిష్కార ప్రగతిని ట్రాక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనిని ఉపయోగించడానికి tsec.gov.in మెయిన్ పేజీలో ఉన్న గ్రీవెన్స్ మాడ్యూల్ ఐకాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ముందుగా తమ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని, ఆ తరువాత తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఈ మాడ్యూల్ ప్రారంభం ద్వారా పౌరుల్లో బాధ్యతను పెంచి, ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ప్రజలు చురుకుగా పాల్గొనేలా చేయాలనే ఎన్నికల సంఘం లక్ష్యం. అలాగే.. పారదర్శకత, బాధ్యతాయుతమైన ఎన్నికలను ప్రోత్సహించే విలువైన సాధనంగా ఈ యాప్ పనిచేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్వసిస్తోంది. కాగా.. ఎన్నికల నియమావళి పూర్తయ్యే వరకూ ఈ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.






