- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్తగా ఆ ముగ్గురికి చోటు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ (Congress) అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. అందులో మూడు లేదా నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు (Governor Jishnu Dev Verma) సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రివర్గ విస్తరణపై రాజ్‌భవన్ (Raj Bhavan) నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం. అయితే, భర్తీ చేయబోయే మూడు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజికవర్గానికి దక్కనుంది. ఒకవేళ మరో మంత్రి పదవి భర్తీ చేయాలనుకుంటే అది మైనారిటీలకు కేటాయించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే కేబినెట్ రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఉన్నారు. కానీ, వారిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.






