- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: అదే గొడ్డలి చేతులు మారింది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బండి సంజయ్
తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రీన్ మర్డర్ (Green Murder) జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 25 లక్షల చెట్లను నరికివేసి హరితహారం (Haritha Haram) ముసుగులో కోనో కార్పస్ మెస్ మొక్కలను ను బహుమతిగా ఇస్తే ఇప్పుడు కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) ప్రాంతంలో జరుగుతున్న హరిత విధ్వంసంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేరిందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ఉన్న గొడ్డలి కొత్త చేతులు మారింది అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కోత, కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ పరిపాలంచబడటం లేదు. అటవీ నిర్మూలన మాఫీయాలో బంధీగా మారిందని ఆరోపించారు.
కాగా హైదరాబాద్ ఐటీ హబ్ కు అతి సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ భూమికి సంబంధించి మాస్టర్ లే ఔట్ డిజైన్ చేసి విక్రయించేందుకు గాను ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నిన్న భూమిని చుదును చేస్తుండగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. పనులు ఆపాలని జేసీబీలకు అడ్డంగా బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.






