- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగులాంబ ఆలయాలను దర్శించుకోనున్న కవిత.. స్వాగతం పలికిన నాయకులు
ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే అబ్రహం అల్లంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు.

దిశ, ఉండవల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవితకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా ఇచ్చి పుష్పగుచ్చం అందజేశారు.
అనంతరం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయానికి కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కవితకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం శివరాత్రి సందర్భంగా బాలబ్రహ్మేశ్వరీ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాధం , బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
- Tags
- MLC Kavita






