హైదరాబాద్‌కు వచ్చిన ఆసియా కప్ హీరో తిలక్ వర్మ.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్‌కమ్

by Gantepaka Srikanth |

పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ తిలక్ వర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌కు వచ్చిన ఆసియా కప్ హీరో తిలక్ వర్మ.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్‌కమ్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ తిలక్ వర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్‌ను 146 పరుగులకే కట్టడి చేసిన భారత్ (Team India).. లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించారు. కీలకమైన మ్యాచ్‌లో 69 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. తాజాగా సోమవారం సాయంత్రం తిలక్ వర్మ హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. తిలక్ వర్మను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు శంషాబాద్ విమానాశ్రయానికి తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడినుంచి తిలక్ ఫ్యాన్స్‎కు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లిపోయారు. వీడియో

Next Story