నిన్నటివరకు స్వీపర్.. రేపటినుంచి సర్పంచ్

by Gantepaka Srikanth |

నిన్నటివరకు స్వీపర్.. రేపటినుంచి సర్పంచ్

నిన్నటివరకు స్వీపర్.. రేపటినుంచి సర్పంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం కచలాపురం గ్రామంలో గ్రామపంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తున్న ఏర్పుల బాబు సర్పంచ్‌గా గెలుపొందారు. కేవలం రెండు ఓట్లతో విజయం సాధించారు. నిన్నటివరకు అదే గ్రామ పంచాయతీలో స్వీపర్‌గా పనిచేసిన బాబు.. రేపటినుంచి అదే గ్రామాన్ని శాసించబోతుండటంతో గ్రామంలో హర్షాతీరేకలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న ఓటర్లు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చెరుపల్లి బుచ్చయ్య(69) గురువారం ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్‌ గదిలోకి వెళ్లి ఓటును వినియోగించుకొని వెను తిరిగిన క్రమంలో స్పృహ కోల్పోయి ఆ ఆవరణలోనే పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు. బుచ్చయ్య 20 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story