- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో కోర్టు కేసులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సర్పంచ్ ఎన్నికలకు ఆటంకం కలిగేలా దాఖలయ్యే కోర్టు కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల్లో (sarpanch elections) రిజర్వేషన్లపై (reservation cases) పలువురు కోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‍లో ప్రత్యేక లీగల్ సెల్ (Legal cell) ఏర్పాటు చేసింది. సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కిషన్‌సింగ్, మాధురిలత, క్రాంతికిరణ్‍తో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ జి.శ్రీజన ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా లీగల్ సెల్ జిల్లాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కోర్టుల్లో వాదనలకు ఉపయోగపడేలా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులకు, ప్రభుత్వం తరఫున లాయర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. కోర్టు కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని సైతం నియమించి వారిని కేసుల విషయంలో అదనపు అడ్వకేట్ జనరల్/గవర్నమెంట్ ప్లీడర్, లీగల్ సెల్‍తో సమన్వయం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.






