- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కుల ఆధారంగా విభజించొద్దు : సర్కారు ఆదేశాలు
by Muthe.Rajitha |
మార్కుల పేరుతో టాపర్స్ సెక్షన్స్, డల్ బ్యాచ్ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది

X
దిశ, వెబ్ డెస్క్ : మార్కుల పేరుతో విద్యార్థులను సెక్షన్లుగా విభజించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని స్కూళ్లలో, కాలేజీల్లో మెరిట్ మార్కులు లేదా ఇతర కారణాలతో విద్యార్థులను వేర్వేరు సెక్షన్లుగా విడగొడుతున్నారు. దీనివల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి, అసమానతలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించిన ఈ టాపర్స్ సెక్షన్స్, డల్ బ్యాచ్ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. అందరినీ సమాన దృష్టితో చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి వివక్ష లేకుండా విద్యార్థులను ఒకే విధంగా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story






