- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HILT Policy: బీజేపీ, బీఆర్ఎస్ కలసి డ్రామాలు.. హిల్ట్ పాలసీ విమర్శలపై శ్రీధర్ బాబు ఫైర్
బీజేపీ నేతలు గుడ్డిగా వ్యతిరేకించాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వ పాలసీని అడ్డుకోవాలని నాటకాలు ఆడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) విమర్శించారు. గతంలో కన్వర్షన్ చార్జీ పెట్టి భూములు దారాదత్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, టైటిల్ పార్క్ చేసింది కూడా బీఆర్ఎస్సేనని శ్రీధర్ బాబు విమర్శించారు. నాడు మౌనంగా ఉన్న బీజేపీ ఇవాళ మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. హిల్ట్ పాలసీపై (HILT Policy) ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు.. ఈ అంశాలపై స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవో తీసుకువచ్చిందని, ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రామికవేత్తలకు ఇచ్చే జీవో తెచ్చారన్నారని ఆరోపించారు.
ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నమే హిల్ట్ పాలసీ అని శ్రీధర్ బాబు చెప్పారు. ప్రభుత్వ భూమిపై హక్కును బదిలీ చేస్తున్నామనేది అబద్ధం అన్నారు. సొంత పారిశ్రామిక భూములు ఉన్నవారికి మాత్రమే కన్వర్షన్ అవకాశం ఇచ్చామని, తాము తెచ్చిన హిల్ట్ పాలసీలో ఎస్ఆర్‍వో రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించామని తెలిపారు. ఈ పాలసీ విషయంలో విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు. పట్టాలు ఉండి సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజు పెట్టాం. లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్వన్ చేసే అవకాశం ఇవ్వలేదని చెప్పారు.






