- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్-2025 విజేతల ప్రకటన..
సమాజానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఇచ్చే ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ - 2025 విజేతల జాబితాను తెలంగాణ లోక్ భవన్ శుక్రవారం ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఇచ్చే ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ - 2025 విజేతల జాబితాను తెలంగాణ లోక్ భవన్ శుక్రవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, గ్రామీణ ఆరోగ్యం, కార్పొరేట్ వాలంటీరింగ్ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. భారత ప్రభుత్వ మాజీ హోంశాఖ కార్యదర్శి, పద్మభూషణ్ గ్రహీత కె. పద్మనాభయ్య అధ్యక్షతన గల ఉన్నత స్థాయి కమిటీ ఈ విజేతలను ఎంపిక చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.ఆర్. బిశ్వాల్, పద్మశ్రీ సునీతా కృష్ణన్, వైద్య నిపుణులు డా. చిన్నబాబు సుంకవల్లి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సెక్రటరీ రమేష్ కాజా సభ్యులుగా వ్యవహరించారు. ఎంపికైన ప్రతి విజేతకు రూ. 2 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు లోక్ భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రధానం చేయనున్నారు. ఈసారి వ్యక్తిగత, సంస్థాగత విభాగాల్లో మొత్తం 8 అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.
వ్యక్తిగత విభాగం:
మహిళా సాధికారత: రమాదేవి కన్నెగంటి (హైదరాబాద్)
గిరిజన అభివృద్ధి: తొడసం కైలాస్ (వాఘాపూర్, ఆదిలాబాద్)
రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంత్రఫీ: డాక్టర్ ప్రద్యుత్ వ్యాఘ్రే (హైదరాబాద్)
కార్పొరేట్ వాలంటీరింగ్: వి. రాజన్న (హైదరాబాద్)
సంస్థల విభాగం:
మహిళా సాధికారత: శ్రీ సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ (ఘట్‌కేసర్)
గిరిజన అభివృద్ధి: ఇండిజీనస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఐడీఓ) (భద్రాద్రికొత్తగూడెం)
రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంత్రపీ: రామదేవ్‌రావు హాస్పిటల్ (హైదరాబాద్)
కార్పొరేట్ వాలంటీరింగ్: గివ్ ఫర్ సొసైటీ (ఘట్‌కేసర్)






