గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా గిరిజన సంస్కృతికి చెందిన కాల‌మానిని ఆవిష్క‌ర‌ణ‌

by Ajay Maddhiboyina |

ప్రముఖ గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని , ప్రముఖ అంతర్జాతీయ ఛాయా చిత్ర కారుడు ఎం.సి.శేఖర్ భారతీయ గిరిజనులు , సంస్కృతి ,జీవన శైలి మరియు సంప్రదాయాలను ఇతివృత్తంగా రూపొందించిన 2026 సంవత్సరానికి చెందిన కాలమానిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ రాజభవన్ లో ఈ రోజు ఆవిష్కరించారు .

గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా గిరిజన సంస్కృతికి చెందిన కాల‌మానిని ఆవిష్క‌ర‌ణ‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రముఖ గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని , ప్రముఖ అంతర్జాతీయ ఛాయా చిత్ర కారుడు ఎం.సి.శేఖర్ భారతీయ గిరిజనులు , సంస్కృతి ,జీవన శైలి మరియు సంప్రదాయాలను ఇతివృత్తంగా రూపొందించిన 2026 సంవత్సరానికి చెందిన కాలమానిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజభవన్ లో ఈ రోజు ఆవిష్కరించారు.

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ ఎం.సి.శేఖర్ ( మేర్గు చంద్ర శేఖర్ ) ఇప్పటికే అంతర్జాతీయంగా 1000 కి పైగా అవార్డులు , 60 దేశాలకు పైగా హానరరీ అవార్డులు , 10 కి పైగా గ్రాండ్ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. గత 34 సంవత్సరాలుగా భారతదేశంలోని గిరిజనుల జీవన శైలి పై ప్రత్యేక ఫోటో డాక్యూమెంటేషన్ లు తయారు చేశారు. కాలమానిని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు గుర్తుండే విధముగా గిరిజనుల ఆచార వ్యవహారాల ను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న ఎం.సి.శేఖర్ ఫోటోగ్రఫీ ని ప్రశంశించి అభినందించారు.

Next Story