- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్‌పీవో కార్యాలయంలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన గవర్నర్
భారతదేశం యొక్క ప్రత్యేకత "భిన్నత్వంలో ఏకత్వం"కి నిదర్శనంగా పనిచేస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశం యొక్క ప్రత్యేకత "భిన్నత్వంలో ఏకత్వం"కి నిదర్శనంగా పనిచేస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ తెలిపారు. భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, హైదరాబాద్-రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ ( ఆర్ పి వో) ఎం ఈ ఏ బ్రాంచ్ సెక్రటేరియట్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో రాజ్యాంగంలోని కళ , కాలిగ్రఫీపై ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,హైదరాబాద్ ఎం ఈ ఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ , రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. రాజ్యంగంను 1950లో జనవరి 24న రాజ్యాంగ పరిషత్‌లోని 284 మంది సభ్యులు సంతకం చేసిన చారిత్రాత్మకమైన రోజుగా గుర్తించబడిందని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ జనరల్, పిఐబి సిబిసి శృతి పాటిల్ పాల్గొన్నారు






