- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ సన్మానం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(Hyderabad)లోని రాజ్‌భవన్‌లో నేడు మిస్ వరల్డ్ 2025 విజేతల(Miss World Winners)ను జరిగిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) సన్మానించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని రాజ్‌భవన్‌లో నేడు మిస్ వరల్డ్ 2025 విజేతల(Miss World Winners)ను జరిగిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో భాగంగా, 108 దేశాల నుంచి పాల్గొన్న అభ్యర్థుల్లో ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ(Opal Suchata Chuangsri) (థాయ్‌లాండ్) మిస్ వరల్డ్ 2025 కిరీటం గెలుచుకోగా, హస్సెట్ డెరెజె అడ్మాస్సు (ఇథియోపియా) మొదటి రన్నర్-అప్, మజా క్లాజ్డా (పోలాండ్) రెండో రన్నర్-అప్, ఆరేలీ జోచిమ్ (మార్టినిక్) మూడో రన్నర్-అప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
నేడు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విజేతలను అభినందిస్తూ.. ఈ ఈవెంట్ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిందని కొనియాడారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఈవెంట్‌ల కేంద్రంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో విజేతలతో పాటు మిస్ వరల్డ్ చైర్‌వుమన్ జూలియా మోర్లీ కూడా పాల్గొన్నారు.






