- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahatma Gandhi: మహాత్మా గాంధీకి తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్ నివాళి
మహాత్మా గాంధీకి తెలంగాణ గవర్నర్, సీఎం రేవంత్ నివాళి అర్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మాగాంధీ (Mahatma Gandhi) వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పింటచారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందన్నారు.






