- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GHMCలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
GHMCలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభించింది. సోమవారం ఫైల్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ ఫైల్ లోక్ భవన్ నుంచి న్యాయ శాఖకు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయనుందని అధికారులు చెబుతున్నారు. విలీన పక్రియలో భాగంగా 27 మున్సిపాలిటీల ఆస్తులను హ్యాండ్ ఓవర్, టేకోవర్ వంటి అంశాల గుర్తించి గెజిట్ లో ప్రస్తావించనున్నారని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ఈనెల 25న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్ని ఈనెల 25న జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన విషయం విదితమే.






