- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Konda Surekha : మహిళా సాధికారిత సాధనకు ప్రభుత్వం చేయూత : మంత్రి కొండా సురేఖ
మహిళా సాధికారిత సాధన(Achieving women's empowerment)కు తెలంగాణ ప్రజాప్రభుత్వం అవసరమైన ఆర్థిక, రాజకీయ చేయూతనందిస్తుందని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు

దిశ, వెబ్ డెస్క్: మహిళా సాధికారిత సాధన(Achieving women's empowerment)కు తెలంగాణ ప్రజాప్రభుత్వం అవసరమైన ఆర్థిక, రాజకీయ చేయూతనందిస్తుందని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్ ప్రెన్స్యూర్షిప్ (WISE) & B2B ఎక్స్‌పో 2025 సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రసంగించే అవకాశం రావడం నాకు లభించిన గొప్స గౌరవంగా భావిస్తున్నానన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ (CM Revanth Reddy Government)సారధ్యంలో తెలంగాణ మహిళా శక్తి అభివృద్ధి చెందగల, ఆర్థిక వృద్ధిని నడిపించగల సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి కట్టుబడి ఉందన్నారు. రాణి రుద్రమ దేవి నుండి నేటి మహిళా పారిశ్రామికవేత్తల వరకు మహిళలు ఎల్లప్పుడూ పురోగతికి మూలస్థంభాలని.. వారిని శక్తివంతం చేయడం మన రాష్ట్ర అభివృద్ధికి కీలకమని కొండా సురేఖ స్పష్టం చేశారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక(SHG) సంఘాల మహిళలను సంపద సృష్టికర్తలుగా మార్చడం జరుగుతుందన్నా్రు. తమ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రూ.1 లక్ష కోట్ల బ్యాంకు లింకేజీలను అందించడంతో పాటు లక్ష మంది మహిళా కోటీశ్వరులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కు శిల్పరామం లో ఇందిరా మహిళా శక్తి బజార్ ను ఏర్పాటు చేశామన్నారు.
గ్రీన్ ఎనర్జీ, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులలో మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారి పేరిట అందిస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాకాలు అందిస్తున్నామని తెలిపారు.






