తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం ప్రభాకర్​

by Muthe.Rajitha |

గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉందన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం ప్రభాకర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉందన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లు ప్రజా పాలన ప్రభుత్వంలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నామని వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

గురువారం మంజీరా ఐఏఎస్​అధికారుల అతిథి గృహాంలో తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఓవర్సీస్ మొబిలిటీ బిల్ -2025 పై చర్చించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు వారికి అన్ని రకాలుగా ఎన్నారై అడ్వైజరీ కమిటీ అండగా ఉంటుందని, గతంలో ఉపాధి కి మాత్రమే పోయేవారు..ఇప్పుడు సాంకేతికత తో పాటు అని రంగాల వారు అక్కడికి వెళ్తున్నారని తెలిపారు.

ల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 2023 డిసెంబర్ 7 నుండి వారికి 5 లక్షల చొప్పన ఆర్థిక సహాయం అందిస్తుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో విదేశాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వారి గురించి ఈ ఎన్నారై ప్రతినిధులకు చెప్పగానే అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారం చేసేవారిని చెప్పారు.ఇప్పటికీ కూడా చదువురాని అమాయక ప్రజలు ఉపాధి కోసం వెళ్లేవారిని కొన్ని బోగస్ కంపెనీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

టామ్ కం కంపనీ ద్వారా మంచి శిక్షణ ఇచ్చి విదేశాల్లో మంచి జీతాలతో అక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఎన్నారై సెల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, విదేశాల వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర నుండి ఈ బిల్లులో ప్రామాణికంగా ఉండే అంశాలు చేర్చాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రవాస నివసితులకు అడ్వైజరీ కమిటీ వారి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. జిల్లాల్లో కూడా గల్ఫ్ ప్రభావితం ఉన్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని వారి సలహాలు సూచనలు స్వీకరించాలని కోరారు.

Next Story