Beerla Ilaiah: స్థానిక సంస్థల్లో నీ పార్టీని నిలబెట్టుకో.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ సవాల్

by Ramesh Naini |

తెలంగాణలో డ్రామా రావు మరో కొత్త డ్రామా మొదలు పెట్టారని కేటీఆర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు.

Beerla Ilaiah: స్థానిక సంస్థల్లో నీ పార్టీని నిలబెట్టుకో.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డ్రామా రావు మరో కొత్త డ్రామా మొదలు పెట్టారని కేటీఆర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు వెళ్లడానికి మొహం చెల్లక కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోనియమ్మ మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఇస్తే సీఎంగా ఉండి (KCR) కేసీఆర్ అప్పులు పాలు చేశారని అన్నారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అంటు అనేక మోసాలు చేసి తెలంగాణకు బాకీ పడింది కేసీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని కొనియాడారు.మా ముఖ్యమంత్రి చేస్తున్న పనులను చూసి ఓర్వ లేక కేటీఆర్ బాకీ కార్డు పేరుతో డ్రామా చేస్తున్నారని అన్నారు.

(KTR) కేటీఆర్.. ఒళ్ళు దగ్గర పెట్టుకో.. గురివింద గింజ తన కింద నలుపు ఎరగనట్లు నీ తీరు ఉందని బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేటీఆర్ డ్రామాలు పనిచేయవన్నారు. బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఓడించారు.. లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేకుండా చేశారు.. స్థానిక సంస్థల్లో బొందపెడతారని ఆయన విమర్శించారు. కేటీఆర్.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే స్థానిక సంస్థల్లో నీ పార్టీని నిలబెట్టుకో అంటూ ప్రభుత్వ విప్ సవాల్ చేశారు. మా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మా ప్రభుత్వం పైన మాట్లాడే నైతిక హక్కు మీకు ఎంత మాత్రం లేదు.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story