సిగ్గులేదు.. భార్య భర్త, సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. ప్రభుత్వ విప్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

మాజీ మంత్రి హ‌రీశ్ రావు తానేదో పోరాట‌యోధుడిలా ఫీల్ అవుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణకు హజ‌ర‌వుతున్నాడ‌న్న విష‌యం ఆయ‌న మ‌రిచిపోతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు.

సిగ్గులేదు.. భార్య భర్త, సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. ప్రభుత్వ విప్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తానేదో పోరాట‌యోధుడిలా ఫీల్ అవుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణకు హజ‌ర‌వుతున్నాడ‌న్న విష‌యం ఆయ‌న మ‌రిచిపోతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. ప‌దేళ్ల పాటు నీచాతి నీచంగా ఫోన్లు ట్యాప్ చేయించి ఇప్పుడు స‌త్యహ‌రిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారు.. సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశార‌ని స్వయంగా క‌విత‌నే స్పష్టం చేసిందిని ఆయన ఆరోపించారు. మంగళవారం బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు డ్రామా చేస్తున్నార‌ని హ‌రీశ్ రావు తెగ బాధ‌ప‌డుతున్నాడు.. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తది కాదు.. గ‌త రెండేళ్లుగా ఈ కేసు విచార‌ణ జ‌రుగుతోంది.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి ఎలా వేధించారో తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసు అని బీర్ల ఐలయ్య ఆరోపణలు గుప్పించారు. ఎన్నో కేసులు పెట్టి మా రేవంత్ రెడ్డి ని అణగదొక్కాలని చూశారు.. తెలంగాణను పదేళ్లు దోచుకున్నారని, హరీశ్ రావు చీటర్.. భార్యాభర్తలు, అధికారులు, నాయకుల ఫోన్ లు సిగ్గులేకుండా ట్యాప్ చేశారు.. మా సీఎం పైన నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని బీర్ల ఐలయ్య హెచ్చరించారు.

Next Story