మామ చాటు అల్లుడిలా నటిస్తున్నావు.. హరీష్‌రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్​

by Ramesh Naini |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంపైన చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

మామ చాటు అల్లుడిలా నటిస్తున్నావు.. హరీష్‌రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంపైన చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ‘మా సీఎంకి వెన్నుపోట్లు తెలియ‌వు.. వెన్ను చూపించ‌డం తెలియ‌దు.. బ‌రి గీసి కొట్లాడ‌టమే తెలుసు, హ‌రీష్ రావు.. నువ్వు మామ చాటు అల్లుడిలా న‌టిస్తు ఆ నాటి సీఎం వైఎస్‌కు నువ్వు చేసిన భాగోతం అంద‌రికి తెలుసు.. వైఎస్ చ‌నిపోక‌పోతే నీ వెన్నుపోటు రాజ‌కీయాలు ఆనాడే బ‌య‌ట‌ప‌డేవి.. హ‌రీస్ రావు.. నువ్వో గురిగింజ‌.. నీ న‌లుపు నీకు తెలియ‌డం లేదు’ అని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆదివారం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. మా సీఎంకి తిన్నింటి వాసాలు లెక్కపెట్టే అల‌వాటు లేదు.. అన్నం పెట్టిన వాళ్లని మ‌రిచిపోయి వాళ్లకు సున్నం పెట్టే అల‌వాటు లేదు.. నీడ‌నిచ్చిన చెట్టును న‌రికే వ్యక్తిత్వం మా సీఎంది కాదన్నారు. రాజ‌కీయ జ‌న్మ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసిన చ‌రిత్ర మీ మామ కేసీఆర్ దని, తెలంగాణ ప్రయోజ‌నాల కోసం త‌న‌కు రాజ‌కీయంగా అండ‌గా నిలిచిన టీడీపీని హుందాగా విడిచి కాంగ్రెస్ లో చేరి మీలాంటి దోపిడిదారుల‌పైన పోరాడి సీఎం అయ్యారని ఆది శ్రీనివాస్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో మీ రాజ‌కీయాల కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ దిమ్మెల‌ను కూల్చమ‌ని పిలుపునిచ్చింది మీరు కాదా..? మీ గ‌ద్దెల‌ను, దిమ్మెల‌ను మేం కూల్చాల్సిన అవ‌స‌రం లేదు.. తెలంగాణ ప్రజ‌లే మిమ్మల్ని కుప్పకూల్చి ఫామ్ హౌస్ లో కూర్చోపెట్టారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పైన నిల‌బ‌డి నిక్కచ్చిగా పోరాడుతున్నది మా సీఎం.. ప‌దేళ్లలో కాషాయ పార్టీతో రాసుకు పూసుకు తిరిగి అవ‌స‌ర‌మైన‌ప్పుడు కౌగ‌లించుకున్న చ‌రిత్ర మీది..చివ‌ర‌కు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సిద్దిపేటను కూడా బీజేపీకి అప్పగించిన చరిత్ర మీదని, బీజేపీతో మీ పార్టీ ప్రేమాయణాన్ని మీ క‌వితే బ‌య‌ట‌పెట్టింది క‌దా..? ముందు ఆమె మాట‌ల‌కు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హ‌రీష్ రావు.. వైపు ఒక వేలు ఎత్తి చూపిస్తే తెలంగాణ ప్రజ‌ల ల‌క్షల గొంతులు మీ చెత్త చ‌రిత్రను బ‌య‌ట పెడ‌తాయి జాగ్రత్త అని ఆయన హితవు పలికారు.

Next Story